ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ సహకార ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో పోలింగ్‌ ముగియనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 77 సంఘాలకు సంబంధించి 994 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో చాలా వార్డులు ఏక గ్రీవమయ్యాయి.

అటు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కూడా పోలింగ్ జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ కాసేపట్లో ముగియనుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 111 ప్రాథమిక సహకార సంఘాలుండగా.. 14 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. 97 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఇప్పటికే భారీగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. మరోవైపు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

Tags

Next Story