నీతి నిజాయితీ కలిగిన చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నం : మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

నీతి నిజాయితీ కలిగిన చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నం చేస్తే.. తిరిగి అది వైసీపీ నాయకులపైనే పడుతుందన్నారు టీడీపీ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ప్రజల కోసం నిరంతరం పని చేసే చంద్రబాబు, లోకేష్‌పై వైసీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ దాడుల్లో చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంట్లో భారీ నగదు దొరికిందని వైసీపీ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. తమపై ఉన్న అవినీతి మచ్చను టీడీపీకి పూయాలని చూస్తే బెడిసికొట్టిందన్నారు సుగుణమ్మ.

Next Story