జామియా విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఎపిసోడ్‌ మరో మలుపు

గతేడాది డిసెంబర్‌ 15న CAAకి వ్యతిరేకంగా ఢిల్లీ జామియా విద్యార్థులు చేపట్టిన ఆందోళనల ఎపిసోడ్‌ మరో మలుపు తీసుకుంది. సీఏఏ ఆందోళన సమయంలో యూనివర్సిటీలోకి వచ్చి... చదువుకుంటున్న తమను పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారని అప్పట్లో విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను రిలీజ్‌ చేశారు జామియా యూనివర్సిటీ స్టూడెంట్స్‌. రీడింగ్‌ రూంలోకి ప్రవేశించిన పోలీసులు.. విద్యార్థులపై లాఠీలతో కొడుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు జామియా యూనివర్సిటీలో ప్రవేశించి పోలీసులు విధ్వంసం సృష్టించారన్న ఆరోపణలను ఢిల్లీ సీపీ ఖండించారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతోనే ఆందోళనకారులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారని వివరణ ఇచ్చారు. చాలా తక్కువ ఫోర్స్‌ను ఉపయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story