ఉస్సేన్ బోల్ట్‌ను మించిన పరుగులు వీరుడు వచ్చాడు

ఉస్సేన్ బోల్ట్‌ను మించిన పరుగులు వీరుడు వచ్చాడు

శ్రీనివాస గౌడ..ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ఈ కన్నడ యువకుడు 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలోనే పూర్తి చేశాడు. ఈ స్పీడ్‌ చూసి అంతా థ్రిల్ అయిపోయారు. ఉస్సేన్ బోల్ట్‌ను మించిన పరుగులు వీరుడు వచ్చాడూ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఎందుకంటే, ఉస్సేన్ బోల్డ్ వంద మీటర్ల దూరాన్ని 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. అంటే, శ్రీనివాసగౌడ, బోల్ట్ కంటే 0.03 సెకన్లు తక్కువ సమయంలోనే వంద మీటర్ల దూరం పరిగెత్తాడు.

బోల్ట్ కంటే శ్రీనివాసగౌడ పరుగే అత్యంత కష్టం. ఎందుకంటే, బోల్ట్ పరిగెత్తింది సింథటిక్ రన్నింగ్ ట్రాక్‌పై. కానీ, శ్రీనివాసగౌడ పరిగెత్తింది బురదలో. ట్రాక్‌పై వేగంగా వెళ్లడం, ఫాస్ట్‌గా స్పీడ్‌ అందుకోవ డం కష్టమై న పని కాదు. కానీ, బురదలో అలా చేయడం అంత ఈజీ కాదు. మామూలుగా బురదలో స్పీడ్‌గా నడవడమే కష్టం. ఏమాత్రం బాలెన్స్ తప్పినా కింద పడిపోతారు. అలాంటిది, అన్ని రకాల అడ్డంకుల ను అధిగమించి 9.55 సెకన్లలోనే వంద మీటర్లు పరుగెత్తడం అంతటే మామూలు విషయం కాదు. అందుకే, శ్రీనివాసగౌడపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

కర్ణాటకలో కంబళ పేరుతో ఎద్దుల పరుగు పందేలు జరిగాయి. ఈ పోటీల్లో శ్రీనివాస గౌడ పాల్గొన్నాడు. ఇతను 142.50 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో పూర్తి చేశాడు. పరుగెత్తిన దూరం, తీసుకున్న సమయాన్ని విశ్లేషిస్తే వంద మీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 9.55 సెకన్లు తీసుకున్నాడు. అది కూడా ఎద్దులను ఉరికిస్తూ తాను పరుగు తీయడం.

శ్రీనివాసగౌడ స్పీడ్ కంబళ చరిత్రలోనే ఓ రికార్డు. అతనికే మొదటి బహుమతి వచ్చింది. ఆ తర్వాతే అతని పేరు మార్మోగిపోయింది. శ్రీనివాస్ స్పీడ్‌ను, ఉస్సేన్ బోల్ట్‌ వేగంతో పోల్చి చూడడం ప్రారం భమైంది. దీంతో ఓవర్‌ నైట్‌లోనే అతను స్టార్‌గా మారిపోయాడు. కంబళ పోటీలు అఫీషియల్‌గా నిర్వహించలేదు. అదే అధికారిక పోటీలైతే, శ్రీనివాస గౌడ విశ్వ చిరుతగా నిలిచేవాడని నెటిజన్లు కితాబి స్తున్నారు.

ఉస్సేన్ బోల్ట్ ప్రొఫెషనల్ స్ప్రింటర్... చిన్నప్పటి నుంచే కఠోర శిక్షణ ఉంటుంది. బాడీ బిల్డింగ్, పౌష్టికాహారం, రేస్‌కు తగినట్లుగా షూస్ తదితర సౌకర్యాలు ఉంటాయి. కానీ, శ్రీనివాస గౌడ ఓ సాధార ణ మధ్యతరగతి రైతు. పొలంలో పని చేసుకోవడం, పశువుల ఆలనాపాలనా చూసుకోవడం అతని పని. కంబళ పోటీలు అంటే చాలా ఇష్టం. ఆ ఇంట్రెస్ట్‌తోనే కంబళ పోటీల్లో పాల్గొన్నాడు. ఫస్ట్ ప్రైజ్ వస్తే అదే గొప్ప విషయమని అనుకున్నాడో ఏమో. కానీ, అతని వేగమే అతన్ని హీరోను చేసింది. ఏకంగా ఉస్సేన్ బోల్ట్ సరసన నిలబెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story