తూర్పుగోదావరి జిల్లాలో దారి దోపిడీ..

తూర్పుగోదావరి జిల్లాలో దారి దోపిడీ జరిగింది. అనపర్తి శివారులో రాజమండ్రి నుండి పనులు ముగించుకుని బైక్‌పై వెళ్తున్న వెత్సా వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అటకాయించిన దుండగులు.. తాము పోలీసులమని.. వాహనం రికార్డులను చూపించాలంటూ బెదిరించారు. ఇదే అదనుగా భావించిన దొంగలు.. వెంకటేశ్వరరావు బైక్‌తో పాటు 18 వేల నగదు, 14 గ్రాముల బంగారు ఉంగరాలు, ఓ ఐఫోన్‌తో పరారయ్యారు. బాధితుడు జరిగిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
