టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖకు స్పందించిన కేంద్రమంత్రి జైశంకర్‌

టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖకు స్పందించిన కేంద్రమంత్రి జైశంకర్‌

కోవిడ్‌ వైరస్‌ కల్లోలం నేపథ్యంలో... చైనాలోని వుహాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు జ్యోతి, సత్యసాయిని భారత్‌కు రప్పించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రాసి లేఖకు స్పందించారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌. వుహాన్‌లో తెలుగు వారిని తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు. జ్యోతి, సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై... కేంద్రం, బీజింగ్‌లోని భారత రాయబార అధికారులు తెలుసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇద్దరికి తీవ్రమైన జ్వరం ఉందని అధికారులు తెలిపారని.. జ్యోతి, సాయి కృష్ణ కుటుంబ సభ్యులు... వుహాన్‌లో ఉన్న వైద్యులు, ఎంబసీ అధికారులతో టచ్‌లో ఉన్నారని లేఖలో వివరించారు. ఈవిషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎప్పటికప్పుడు జాగ్రతలు తీసుకోవాలని వైద్యులకు సూచించామన్నారు. జ్యోతి, సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తూ ఉంటామని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు జైశంకర్.

వుహాన్‌లో కోవిడ్‌ వైరస్‌ కల్లోలం రేపుతోంది. వైరస్‌ దెబ్బకి వుహాన్‌ నిర్మానుష్యంగా మారిపోయింది. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తినడానికి సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. కొంత మంది నగరం వీడి వెళ్తే.. మరికొంత మంది వైరస్‌ భయంతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే చాలా మంది భారతీయులు ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా.. తెలుగు విద్యార్థులు జ్యోతి, సత్యసాయి అక్కడే చిక్కుకుపోయారు. దీంతో గత కొన్ని రోజులుగా తమను భారత్‌కు రప్పించాలని వేడుకుంటున్నారు.

Tags

Next Story