ఆంధ్రప్రదేశ్

వైసీపీ విష ప్రచారం.. రెండు లక్షలు దొరికితే 2 వేల కోట్లు దొరికాయంటూ గోల..

వైసీపీ విష ప్రచారం.. రెండు లక్షలు దొరికితే 2 వేల కోట్లు దొరికాయంటూ గోల..
X

ప్రపంచంలో ఏం జరిగినా దాన్ని చంద్రబాబుకు అండగట్టే ప్రయత్నాలు చేసే వైసీపీ.. తాజాగా చేసిన విష ప్రచారం అంతా అబద్ధమేని తేలిపోయింది. ఇటీవలి ఐటీ సోదాల్లో చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో 2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ నేతలు ఊదరగొట్టారు. మంత్రులు కూడా ఇది నిజం కాదని తెలిసి కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఆరోపించారు. ఐతే.. శ్రీనివాస్ ఇంట్లో సోదాల తర్వాత ఐటీ శాఖ ఇచ్చిన డాక్యుమెంట్‌లో లెక్కలు చూస్తే వాస్తవాలు అందరికీ అర్థమవుతాయి. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్ ఇంట్లో సోదాల తర్వాత పంచనామాలో తాము గుర్తించింది 2 లక్షల 63 వేల రూపాయలు మాత్రమేనని IT శాఖ స్పష్టం చేసింది. దీంతో .. 2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ నేతలు చేసిదంతా విష ప్రచారమేనని తేలిపోయింది.

వైసీపీ కుట్రతోనే తప్పుడు ఆరోపణలు చేసిందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 లక్షల 63 వేలు దొరికితే 2 వేల కోట్లని ఎలా రాస్తారంటూ మండిపడింది. చంద్రబాబుపై బురద చల్లే ప్రయత్నాలు ఆపాలని హితవు పలికారు టీడీపీ నేతలు.

Next Story

RELATED STORIES