హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. యువతికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. యువతికి తీవ్రగాయాలు
X

హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లో దారుణం జరిగింది. అలేఖ్య అనే యువతి రోడ్డు దాటుతుండగా.. కారు ఢీ కొట్టింది. కొంచెం దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో కారు కింద నలిగి.. అలేఖ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

అప్పటికే చాలా సేపటి నుంచి రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తోంది అలేఖ్య. కాస్త ట్రాఫిక్‌ జామ్‌ తక్కువైందనుకుని రోడ్డు దాటేందుకు యత్నించింది. అయితే.. హఠాత్తుగా బైక్‌ రావడంతో.. ఆమెతో పాటు బైక్‌ నడుపుతున్న వ్యక్తి కిందపడిపోయాడు. ఆ వెంటనే ఉన్న కారు.. అలేఖ్య పై దూసుకెళ్లింది. దీంతో ఆ యువతి కారు కింద నలిగిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో ప్రణీత అనే మహిళ కారు నడుపుతోంది.

Tags

Next Story