ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై సోనంకపూర్ మండిపాటు

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై  సోనంకపూర్ మండిపాటు
X

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తెలివి తక్కు వ మాటలు ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. ఈ మనిషి ఇలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఆ మాటలు పూర్తిగా తెలివితక్కువ తనంతో కూడుకున్నవని, వెనకబాటుతనాన్ని సూచించేవని విమర్శించారు.

విడాకులపై మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజుల్లో విడాకుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్థం పర్థం లేని విషయాలకే డైవోర్స్ తీసుకుంటున్నారని తెలిపారు. బాగా చదువుకున్న వాళ్లు, ఐశ్వర్యవంతుల్లోనే విడాకుల సంఖ్య ఎక్కువగా ఉంటోందన్నారు. డైవోర్స్ కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నమ వుతున్నాయని చెప్పారు. సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలను సోనమ్ కపూర్ తప్పుబట్టారు.

Tags

Next Story