కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో వెలుగులోకి వస్తున్న ఆశ్చర్యకర విషయాలు

కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో వెలుగులోకి వస్తున్న ఆశ్చర్యకర విషయాలు

కరీంనగర్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. మృతులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి బంధువులుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని కరీంనగర్ కలెక్టర్ శశాంక, పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రస్తుతానికి ప్రమాదం జరిగిన తీరు తెలియరానప్పటికీ.. దీనిపై విచారణ చేపడుతామని కమీషనర్ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు.

మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉండి.. తరలించే అవకాశం లేకపోవడంతో అక్కడే పంచనామా, పోస్ట్ మార్టమ్ నిర్వహించారు అధికారులు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తన చెల్లెలి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవ అన్నారు. ఇటీవలే వారి కుమారుడు చనిపోయాడని.. ఆ దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో.. ఇప్పుడిలా జరగడం బాధాకరమని దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story