కర్నూల్‌ వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

కర్నూల్‌ వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

కర్నూల్‌ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కర్నూల్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య బ్యానర్ల తొలగింపు వివాదం రచ్చ రాజేస్తోంది. ఇద్దరు నేతల మధ్య మనస్పర్థలు బయటపడ్డాయి. అర్థరాత్రి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ బ్యానర్లను అధికారులు తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్వీ.. బ్యానర్లు ఎందుకు తొలగించారని మున్సిపల్‌ అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే తొలగించామని అధికారులు చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్వీ వర్గం.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు నేతల పంచాయితీ సీఎం దగ్గరకు చేరనుంది.

Tags

Next Story