విశాఖలో ఉద్రిక్తత.. ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ పనులను అడ్డుకున్న రైతులు
By - TV5 Telugu |17 Feb 2020 3:28 PM GMT
విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో ప్రభుత్వ భూసేకరణ పనులు ఉద్రిక్తతకు దారి తీశాయి. పెంటవాని చెరువు దగ్గర ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ పనులను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే అక్కడ పోలీసులు మోహరించారు. రైతులకు మద్దతుగా టీడీపీ నేతలు బండారు సత్యనారాయణ మూర్తి, గండి బాబ్జీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బలవంతపు భూసేకరణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com