మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన శ్రీకాళహస్తి
మహాశివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తి ముస్తాబైంది. ఆలయం లోపల, వెలుపల రంగులు వేస్తున్నారు. విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. తేలికపాటి మరమ్మతులు చేస్తున్నారు. పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రసాదం టికెట్లను క్యూలైన్లలోనే ఇవ్వనున్నారు. ప్రత్యేక పూల అలంకరణ, ఫ్లవర్‌షో, లేజర్‌షో, గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. అటు స్వర్ణముఖి నదిని కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీకాళహస్తి వచ్చే భక్తుల కోసం ఉచిత మినీ బస్సులను సిద్ధం చేస్తున్నారు. కపిలతీర్థం నుంచి విద్యుత్ కటౌట్లు తెప్పిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్హణకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, విద్యుత్, వైద్య, ఆర్టీసీ, ఆర్ అండ్ బీ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు.. మంచినీటికి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వామిసేవలో పాల్గొనే సామాన్య భక్తులు సంతృప్తి వ్యక్తంచేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు ఆలయ అధికారులు చెప్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com