పోలీస్ స్టేషన్‌‌లో తుపాకీలు దొంగిలించి.. సామాన్యులపై హల్‌చల్

పోలీస్ స్టేషన్‌‌లో తుపాకీలు దొంగిలించి.. సామాన్యులపై హల్‌చల్

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేటలో గంగరాజుపై కాల్పులు జరిపిన సదానందం వాడిన తుపాకులు పోలీసులవేనని తేల్చారు. 2016లో హూస్నాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి 2 వెపన్స్‌ ఎత్తుకెళ్లాడన్నారు. అందులో ఒకటి ఏకే 47 కాగా మరొకటి కార్బన్‌ తుపాకీ. సదానందం ఉపయోగించినది ఈ ఏకే 47నేనని తెలిపారు ఇన్‌ఛార్జ్‌ సీపీ శ్వేత. గంగరాజుపై కాల్పులు జరినప్పుడే ఈ విషయం బయటపడిందన్నారు. తుపాకులు పోయిన అంశంపై అప్పుడున్న పోలీసుల్ని విచారించి చర్యలు తీసుకుంటామని.. దీనిపై త్వరలో ఛార్జ్‌షీట్‌ వేస్తామన్నారు ఇన్‌ఛార్జ్‌ సీపీ శ్వేత.

ఈ నెల 6న గోడ విషయంలో తలెత్తిన గొడవ కాల్పుల వరకు వెళ్లింది. గంగరాజుపై కోపంతో సదానందం అనే వ్యక్తి ఏక-47తో కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తూ ఎవరికీ బుల్లెట్ తగల్లేదు. ఈ కేసులో సదానందను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆయనకు ఏకే-47 ఎలా వచ్చిందనేపై కోణంపై దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆయన వాడింది హుస్నాబాద్‌ పీఎస్‌ నుంచి మాయమైన AK 47గా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story