ఉగ్రవాది అబ్దుల్‌ కరీం టుండా కేసులో వెలువడనున్న తుదితీర్పు

ఉగ్రవాది అబ్దుల్‌ కరీం టుండా కేసులో వెలువడనున్న తుదితీర్పు

ఉగ్రవాది అబ్దుల్‌ కరీం టుండా కేసులో మంగళవారం తుదితీర్పు రానుంది. గత నెల 21న తీర్పు వెల్లడించాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. టుండా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జైల్లో ఉంటున్నాడు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టుండాను విచారించనుంది నాంపల్లి కోర్టు. హుమాయూన్‌ నగర్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద పేలుళ్లకు టుండా కుట్ర పన్నాడు. సీసీఎస్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. దేశ వ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్లకు పాల్పడినట్లు ఇతనిపై అభియోగాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో అతనిపై 40కిపైగా కేసులున్నాయి.

లష్కరే తోయిబాలో అబ్దుల్‌ కరీం టుండా కీలకంగా పని చేశాడు. బాంబుల తయారీ, పేలుళ్లలో నిష్ణాతుడు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత పేలుళ్లకు పాల్పడ్డాడు. 1993లో ముంబై వరుస పేలుళ్లలోనూ నిందితుడు. ముంబై పేలుళ్ల తర్వాత పాక్‌లో తలదాచుకున్నాడు. 2013 ఆగస్టులో నేపాల్‌ సరిహద్దులో టుండాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story