చింతూరు ఏజెన్సీలో మైనింగ్ మాఫియా

చింతూరు ఏజెన్సీలో మైనింగ్ మాఫియా

తూర్పుగోదావరి జిల్లా చింతూరు ఏజెన్సీలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. కాన్సులూరు గ్రామం వద్ద కొండల్ని పిండి చేయడానికి సిద్ధమయ్యారు. క్రషర్ మిల్లుల కోసం.. ఇక్కడి కొండల్ని ధ్వంసం చేసి.. అడ్డంగా దోచుకునేందుకు ప్లాన్‌ వేస్తున్నారు. కొండల్ని పిండి చేయడానికి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు.

పాపికొండలు అభయారణ్యంలో వచ్చే ఈ ఏజెన్సీలో.. పేలుళ్లు జరపడానికి అనుమతులున్నాయా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శాంపిల్స్‌ సేకరణ పేరుతోనే.. ఇంత భారీస్థాయిలో పేలుళ్లు జరిగితే.. ఇక అక్కడ పనులు పూర్తిస్థాయిలో జరిగితే పరిస్థితి ఏమిటని గిరిజనులు భయపడుతున్నారు. ఇక్కడ జరిగిన పేలుళ్లపై అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్న తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags

Next Story