పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయి : మంత్రి కేటీఆర్

పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయి : మంత్రి కేటీఆర్

తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందనన్నారు మంత్రి కేటీఆర్‌. పరిశ్రమలను నెలకొల్పేందుకు అవసరమైన అనుమతులను సులభతరం చేశామన్నారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ మండలంలోని బయోటెక్‌ పార్కు జీవోమి వ్యాలీలో నూతనంగా ఏర్పాటు చేసిన సెన్‌జేన్‌, బయాలోజికల్ కంపెనీలను కేటీఆర్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మసీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి కల్పనలో తెలంగాణను దేశంలోనే ముందువరుసలో నిలిపేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story