రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ సర్‌ప్రైజ్

రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ సర్‌ప్రైజ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ రిక్షా కార్మికుడిని కలిశారు. ఆయన్ను తన దగ్గరికి పిలిపించుకొని మరీ ముచ్చటించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబం గురించి ఆరా తీశారు. స్వయంగా ప్రధాని తనతో మాట్లాడడంతో సదరు రిక్షా కార్మికుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. జీవితంలో ఇలాంటి రోజొకటి వస్తుందని అనుకోలేదని, ఇది తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పాడు.

మోదీని కలిసిన రిక్షా కార్మికుని పేరు మంగల్ కేవత్. వారణాసిలో రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అంతకుమించి గంగానది భక్తుడు. రిక్షా తొక్కడం ద్వారా వచ్చే సంపాదనలో కొంత మొత్తాన్ని గంగానదిని శుభ్రం చేయడానికి ఖర్చు పెడుతుంటాడు. అతని నిస్వార్థ సేవకు కాశీలో చాలా మంది అభిమానులున్నారు. ఇక, మంగల్ కేవత్ కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. పెళ్లికి రావాలంటూ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శుభలేఖ పంపారు. స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి శుభలేఖను అందించారు. ఐతే, పనుల ఒత్తిడి కారణంగా ప్రధాని మోదీ మంగల్ కేవత్ కుమార్తె వివాహానికి వెళ్లలేకపోయారు. పెళ్లికి రాలేకపోయినప్పటికీ వధూవరులకు ఆశీస్సులు పంపుతూ లేఖ పంపారు. ఆ లేఖను చూసి మంగల్ కేవత్ కుటుంబసభ్యులు చాలా సంతోషపడ్డారు.

ఇటీవల ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. అదే సమయంలో మోదీకి, మంగల్ కేవత్ గుర్తుకువచ్చారు. కేవత్ కుమార్తె పెళ్లి విషయం గుర్తుకు వచ్చింది. దాంతో, మంగల్ కేవత్‌కు కబురు పెట్టారు. అతన్ని తన వద్దకు పిలిపించుకొని కాసేపు మాట్లాడారు. మోదీ తనను పిలిపించుకోవడంతో కాసేపు షాక్ తిన్నానని మంగళ్ కేవత్ పేర్కొన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story