కంబాళ రేసుతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన శ్రీనివాస్ గౌడ
కర్నాటకలోని కంబాళ రేసులో తన వేగంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు శ్రీనివాస్ గౌడ. మంగళూరులో ఇటీవల జరిగిన కంబాళ పోటీల్లో 142.5 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలో పూర్తి చేసిన శ్రీనివాస్ గౌడ.. అందరి దృష్టిని ఆకర్షించాడు. కంబాళ పోటీలో శ్రీనివాస గౌడ వేగాన్ని లెక్కించిన ఓ నెటిజన్.. 100 మీటర్ల పరుగుని కేవలం 9.55 సెకన్లలోనే పూర్తి చేసినట్లు తేల్చాడు.
వరల్డ్‌లో ఫాస్టెస్ట్ రన్నర్‌గా గుర్తింపు పొందిన జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కంటే 3 సెకన్ల ముందే 100మీ పరుగుని శ్రీనివాస్ పూర్తి చేశాడు. ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్ రేస్‌లో పోటీపడుతున్న వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో.. అది నిమిషాల్లోనే వైరల్‌గా మారిపోయింది.
కర్ణాటకలోని అతడికి మెరుగైన శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్‌కి పంపించాలని చాలా మంది ప్రముఖులు సూచించడంతో.. కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు స్వయంగా స్పందించి అతనికి ఒకసారి ట్రయల్స్ నిర్వహించాల్సిందిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల్ని ఆదేశించాడు. మంత్రి ఆదేశాలు, సెలబ్రిటీల అభ్యర్థనలతో అతనికి ట్రయల్స్ నిర్వహించేందుకు సాయ్ ముందుకొచ్చింది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే ట్రయల్స్‌లో ఇప్పుడే పాల్గొననని, దానికి కొంత సమయం కావాలని శ్రీనివాస గౌడ తెలిపాడు. కంబళలో మరిన్ని ఘనతలు సాధించాలని అనుకుంటున్నానని, ప్రస్తుతం కంబళ టోర్నమెంట్ సాగుతున్నందున ఒక నెల గడువు కావాలని సాయ్ ను కోరాలని భావిస్తున్నాను అన్నాడు. ట్రాక్స్ లో వేళ్ల మీద పరిగెత్తితే, కంబళలో మడమల మీద పరిగెత్తుతామని. ఒక దానిలో రాణించేవారు మరో దానిలో అంతగా సత్తాచాటలేరని అభిప్రాయపడ్డాడు.
చిరుత వేగంతో ఒక్కరాత్రిగా స్టార్‌గా మారిన శ్రీనివాస గౌడకు.. ట్రయల్స్ నిర్వహించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకు రావడంతో మనకు ఉసేన్ బోల్ట్ దొరికాడని అంతా ఆశించారు.. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా శ్రీనివాస గౌడ అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com