బెంగాలీ నటుడు, మాజీ ఎంపీ తపస్‌ పాల్‌ మృతి

బెంగాలీ నటుడు, మాజీ ఎంపీ తపస్‌ పాల్‌ మృతి
X

ప్రముఖ బెంగాలీ నటుడు, తృణముల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ తపస్‌ పాల్‌(61) గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా గుండెపోటుతో బాధపడుతోన్న తపస్‌ పాల్‌ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తపస్పాల్‌కు భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు.

సోమవారం తపస్‌పాల్‌ తన కుమార్తెను చూడటానికి ముంబై వెళ్లి తిరిగి విమానంలో కొల్‌కతాకు వచ్చేటప్పుడు.. విమానాశ్రయంలో గుండె నొప్పి రావడంతో.. జుహులోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తపస్‌ పాల్‌ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఆయన పలు బెంగాలీ చిత్రాల్లో నటించారు. కేవలం సినిమాల్లోనే కాకుండా తపస్‌పాల్‌ రాజకీయాల్లో కూడా రాణించారు. ఆయన తృణముల్‌ కాంగ్రెస్‌లో ఎంపీగా గెలిచారు.

Tags

Next Story