రెవెన్యూ అధికారులకు చెమటలు పట్టించిన అమరావతి రైతులు

రెవెన్యూ అధికారులకు చెమటలు పట్టించిన అమరావతి రైతులు

అమరావతిలో భూముల్ని సర్వే చేసేందుకు వచ్చిన తహసీల్దార్‌, ఇతర రెవెన్యూ అధికారుల్ని అడ్డుకున్నారు రాజధాని రైతులు. తమ భూములు ఎలా సర్వే చేస్తారమంటూ వారిపై మండిపడ్డారు. సర్వే చేయనిచ్చేది లేదంటూ.. రోడ్డుపైనే బైఠాయించారు. రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో.. పోలీసులు అక్కడి చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

తమ భూములను ఇచ్చింది రాజధాని కోసమని, పేదలకు ఇళ్ల పట్టాలుగా పంచేందుకు కాదంటూ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పేదలను ఇక్కడకు తీసుకొచ్చి పట్టాలిస్తామంటే ఎలాగని నిలదీస్తున్నారు. తాము పేదలకు పట్టాలు ఇవ్వడానికి వ్యతిరేకం కాదని.. అయితే తమ భూములు మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.

టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లు ఇస్తే చాలని అంటున్నారు. రైతులే ఆవేదనతో ఉంటే ఆ భూములు తమకు పంచి ఇస్తామని చెప్పడం సరికాదంటున్నారు. ఈ తరహా పట్టాల పంపిణీ తమకు అవసరం లేదని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సర్వేలను చేయనిచ్చేది లేదన్నారు రాజధాని రైతులు.

మరోవైపు.. తాను ఎందుకు వచ్చిందో చెప్పలేకపోతున్నారు ఎమ్మార్వో. రైతులకు అడిగి ఏ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పడం లేదు.

Tags

Next Story