జగన్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నేటినుంచి ప్రజా చైతన్య యాత్ర

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాటకు సిద్ధమయ్యారు... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సర్కార్ నిర్ణయాలతో రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజా చైతన్య యాత్రకు చేపట్టనున్నారు. ఇవాల్టి నుంచి ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టనున్నారు.
ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొప్పూడి నుంచి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం మేదరమెట్లలో బహిరంగ సభ జరుగుతుంది.. ఆ తర్వాత గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్, సాయంత్రం మద్దిపాడు, త్రోవగుంట, కర్నూలు రోడ్డులో ర్యాలీ నిర్వహించనున్నారు.. ఆ తర్వాత ఒంగోలులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. దారిపొడవునా ప్రజల సమస్యలు, వారు పడుతున్న కష్టాలు అడిగి తెలుసుకోనున్నారు చంద్రబాబు.
రాష్ట్రంలో అసమర్థ, అరాచక పాలన సాగుతోందని అన్నారు. ప్రజలను మోసగిస్తున్న తీరుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే తాను యాత్ర చేపడుతున్నట్టు వివరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజా చైతన్య యాత్రలో పెద్దసంఖ్యలో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను జనం మధ్య ఎండగట్టాలని సూచించారాయన. ప్రభుత్వ బాధితులకు టీడీపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని పార్టీ శ్రేణులను చంద్రబాబు కోరారు. అటు మంగళగిరిలో.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రజాచైతన్య యాత్రలో పాల్గొంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com