ఎల్ఐసీ ఏజెంట్లకు కితాబిచ్చిన మంత్రి హరీష్ రావు

ఎల్ఐసీ ఏజెంట్లకు కితాబిచ్చిన మంత్రి హరీష్ రావు
X

సిద్ధిపేటలోని కమర్షియల్‌ కాలనీలో శాశ్వత ఎల్ఐసీ భవనానికి మంత్రి హరీష్‌ రావు శంకుస్థాపన చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. అనంతర నూతన కలెక్టరేట్‌ కార్యాలయం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్ఐసీ జోనల్ మేనేజర్‌, ఎల్ఐసీ ప్రముఖ ప్రతినిధులకు మంత్రి సిద్ధిపేట గొల్లభామ చీరలు అందజేశారు. సిద్ధిపేట ఎల్ఐసీ ఏజెంట్లు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. తనవద్దే నాలుగైదు పాలసీలో చేయించారని అన్నారు.

Next Story