శేషాచలం అటవీ ప్రాంతంలో మరోసారి అలజడి

శేషాచలం అటవీ ప్రాంతంలో మరోసారి అలజడి

శేషాచలం అటవీ ప్రాంతంలో మరోసారి అలజడి రేగింది. కూంబింగ్‌ చేస్తోన్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి కరకంబాడి రోడ్డులోని టీఎన్‌ఆర్‌ కల్యాణమండపం దగ్గర్లో వంద మంది స్మగ్లర్లు తారసపడ్డారు. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్‌.....రెండు వాహనాలతో పాటు ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. స్మగ్లర్లు లోడింగ్‌ చేస్తోన్న 34 ఎర్ర చందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ ఇంచార్జ్‌ రవిశంకర్‌... ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు.

Tags

Next Story