అమ్మకానికి ఆడపిల్ల
శ్రీకాళహస్తిలో అమ్మకానికి ఆడపిల్ల. మీరు విన్నది నూటికి నూరు శాతం నిజం. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబంలో పుట్టడమే వారి పాలిట శాపంగా మారింది. ఇద్దరూ అమ్మాయిలు కావడంతో.. వారి పోషణ భారంగా మారిందని ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. అందుకే ఒకర్ని అమ్మకానికి పెట్టారని.. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది.
శ్రీకాళహస్తి మండలం తొండమాన్‌పురం గ్రామానికి చెందిన తల్లిదండ్రులకు ఇద్దరు అమ్మాయిలు. వారికి కుటుంబం గడవడమే కష్టంగా మారింది. స్థానికంగా ఒకాయనకు అమ్మాయిని విక్రయించేందుకు సిద్ధం అయ్యారు. దీంతో.. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కుటుంబం గడవడం కష్టంగా మారిందని అమ్మాయిని అమ్మకానికి పెట్టారనే సమాచారం తెలుసుకుని శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వారితో పాటు.. ICDS సిబ్బంది పేద తల్లిదండ్రులను విచారణ చేశారు. ఆ తల్లిదండ్రులు తమ బంధువులతో తమాషాగా మాట్లాడిన మాటలను.. కొందరు అపార్థం చేసుకున్నట్టు విచారణలో తేలిందని సీఐ చెప్తున్నారు. అమ్మాయిల రక్షణ కోసం వారిని బాలసదన్‌కు తరలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com