రస్ అల్‌ఖైమా లేఖ వచ్చిన తర్వాత జగన్ వణికిపోతున్నారు - వర్ల రామయ్య
By - TV5 Telugu |19 Feb 2020 2:21 PM GMT
సీఎం జగన్‌ను అప్పగించాలని రస్ అల్‌ఖైమా... కేంద్రానికి లేఖ రాసింది నిజమేనా అని ప్రశ్నించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. జగన్‌ను అప్పగించడంతో పాటు తమ డబ్బును సైతం జగన్‌ను నుంచి వసూలు చేయాలన్నది ఆ లేఖలో సారాంశమని తెలిపారు వర్ల. అందుకే సీఎంజగన్ హడావుడిగా ఢిల్లీ వెళ్లారన్నారు. రస్‌అల్‌ఖైమా ఇచ్చిన డబ్బును దుర్వినయోగం చేశారనే ఆరోపణలపై నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు 7 నెలల క్రితం అరెస్ట్ చేశారన్నారు వర్ల . అయితే ఈ డబ్బును... సీఎం జగన్‌కు చెందిన వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టినట్లు నిమ్మగడ్డ స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు వర్ల. అందుకే కేంద్రానికి రస్ అల్‌ఖైమా... కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోందన్నారు వర్ల రామయ్య.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com