చంద్రబాబు, లోకేష్ భద్రతను కుదించడం వెనుక వైసీపీ కుట్ర ఉంది: టీడీపీ

చంద్రబాబు, లోకేష్ భద్రతను కుదించడం వెనుక వైసీపీ కుట్ర ఉంది: టీడీపీ

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాలోకేష్ కు భద్రత తగ్గించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ల భద్రత విషయంలో వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. చంద్రబాబుకు టెర్రరిస్టులు, మావోయిస్టులు, స్మగ్లర్ల నుంచి ముప్పు పొంచి వుందని అన్నారు. అందుకే NSG, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత వుందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రతను సగానికి సగం కుదించారని ఆరోపించారు. మాజీ మంత్రి లోకేష్ కు బెదిరింపులు వున్నాయని.. ఆయన భద్రతను కూడా జడ్ స్థాయి నుంచి ఎక్స్ స్థాయికి తగ్గించారని అన్నారు. వారికి ఏమైనా జరిగితే వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు.

అటు ఇదే అంశంపై టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య కూడా స్పందించారు. చంద్రబాబు, లోకేష్ భద్రతను కుదించడం వెనుక వైసీపీ కుట్ర దాగుందని అన్నారు. వారికి తీవ్రవాదుల నుంచి మప్పు పొంచి ఉన్న సంగతి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ల భద్రత విషయంలో రాజకీయం చేయాలనుకోవడం మంచిది కాదన్నారు. వారిద్దరికీ వెంటనే పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story