తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రాజెక్టులను వేగవంతం చేయండి: వెంకయ్యనాయుడు

తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రాజెక్టులను వేగవంతం చేయండి: వెంకయ్యనాయుడు
X

తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని.. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖామంత్రి కిరణ్ రిజిజును ఆదేశించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రిజిజుతో భేటీ అయిన ఆయన.. ప్రైవేటు రంగాన్ని కూడా క్రీడారంగంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడలు నిర్వహించాలని కోరారు. దీనిపై స్పందించిన రిజిజు.. ఏపీలో పలు ఇండోర్ స్టేడియంలతో పాటు.. ఇతర ప్రాజెక్టుల కోసం నిధులు విడుదల చేశామన్నారు. అయితే, యూసీలు రావడం ఆలస్యం అవుతోందని ఉపరాష్ట్రపతికి తెలిపారు.

Tags

Next Story