తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి..

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి..

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుప్పూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళ ఆర్టీసీ బస్సును... కంటైనర్‌ లారీ ఢీ కొట్టింది. 19 మంది అక్కడిక్కడే చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 20 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. మృతులు సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. తిరుప్పూరు సమీపంలో తెల్లవారు జామున 3 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులకు తిరుప్పూరు, కోయంబత్తూరు ఆసుపత్రులకు తరలించారు.

తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనలో తిరుప్పూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళ ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఏమైందో తెలుసుకునేలోపే.. కొందరు కన్నుమూశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

Tags

Read MoreRead Less
Next Story