తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. తిర్పూర్ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. ప్రయాణికులు నిద్రమత్తులో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో చాలామంది చనిపోయారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
కేరళకు చెందిన ఆర్టీసీ బస్సు తిర్పూర్ నుంచి తిరువనంతపురం వెళ్తోంది. అవినాషి ఏరియాలో ఆర్టీసీ బస్సును ఓ కంటైనర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. యాక్సిడెంట్‌లో 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్‌లను రప్పించి, గాయప డినవారిని తిర్పూర్, కోయంబత్తూర్ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com