అక్రమ కేసులకు భయపడేది లేదు: అమరావతి రైతులు

అక్రమ కేసులకు భయపడేది లేదు: అమరావతి రైతులు

ఎమ్మార్వోను అడ్డుకున్నారంటూ తమపై తప్పుడు కేసులు పెట్టారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట కేసులు పెట్టమని చెప్పి.. తీరా ఇవాళ కేసులు నమోదు చేశారని అన్నారు. రాజధాని కోసం కేటాయించిన భూముల్లో ఎలా సర్వే చేస్తారని ప్రశ్నించారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమరావతి రైతులు రోడ్డుపై బైటాయించి ఆందోళన నిర్వహించారు. నడిరోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ కేసులకు బయపడేది లేదని.. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు.

Tags

Next Story