పల్లె ప్రగతి ద్వారా మంచి ఫలితాలు సాధించేలా ప్రయత్నాలు ముమ్మరం

పల్లె ప్రగతి ద్వారా మంచి ఫలితాలు సాధించేలా ప్రయత్నాలు ముమ్మరం
X

పల్లె ప్రగతిని సీఎం ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో తెలంగాణ మంత్రులు పల్లె ప్రగతిపై ఫోకస్ చేస్తున్నారు. కొద్ది రోజుల్లో పట్టణ ప్రగతి చేపట్టబోతున్న నేపథ్యంలో పల్లె ప్రగతి ద్వారా మంచి ఫలితాలు సాధించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జనంలోకి వెళ్లి పల్లె ప్రగతి విశిష్టతను ప్రయోజనాలను చాటుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పల్లె ప్రగతిపై ఏర్పాటు చేసిన పంచాయితీ రాజ్ సమ్మేళనంలోమంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత ద్వారానే పల్లెల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామాల అభివృద్దే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి ప్రారంభించారని అన్నారు.

మహాబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయితీ రాజ్ సమ్మేళనానికి మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. కొత్త గ్రామ పంచాయితీలకు మంజూరైన 150 ట్రాక్టర్లను మంత్రి పంపిణీ చేశారు.

పల్లె అభివృద్ధికి చేపట్టాల్సిన అన్ని పనులను గుర్తించి వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామా అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని సత్యావతి రాథోడ్ అన్నారు.

మరోవైపు మెదక్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. చత్రపతి శివాజీ 389వ జయంతి పురస్కరించుకొని రమాయంపేటలో చత్రపతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరాఠీల ఆత్మగౌరవం కోసం పొరాడిన శివాజీ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు.

సిద్ధిపేటలోని కమర్షియల్‌ కాలనీలో శాశ్వత ఎల్ఐసీ భవనానికి మంత్రి హరీష్‌ రావు శంకుస్థాపన చేశారు.అనంతర నూతన కలెక్టరేట్‌ కార్యాలయం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

Tags

Next Story