వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్

సీఎం జగన్‌.. ప్రకాశం జిల్లాలో పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించారు. ఈ ఉదయం వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న జగన్‌కు ఘనస్వాగతం పలికారు మంత్రులు, వైసీపీ నేతలు. వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ వద్దకు చేరుకుని ప్రత్యేక వాహనం ద్వారా టన్నెల్ లోపలకు వెళ్లిన సీఎం జగన్‌.. అక్కడి పనులను పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్‌ అధికారులతో రివ్యూ చేశారు. జగన్‌ వెంట మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, అనిల్‌ కుమార్ యాదవ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

Tags

Next Story