ఆంధ్రప్రదేశ్

మందడంలో డ్రోన్ కలకలం.. రైతులు ఆగ్రహం..

మందడంలో డ్రోన్ కలకలం.. రైతులు ఆగ్రహం..
X

మందడంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ కానిస్టేబుల్‌.. గ్రామంలో డ్రోన్‌ కెమెరాతో దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. మహిళలు స్నానం చేస్తుండగా.. ఉద్దేశపూర్వకంగానే వీడియో చిత్రీకరించారంటూ ఆందోళనకు దిగారు. డ్రోన్‌ ఆపరేట్‌ చేసిన కానిస్టేబుల్‌ను అడ్డుకున్నారు. గ్రామస్తులను అదుపు చేసేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రాజధాని కోసం ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న తమపై పోలీసులు దాష్టీకాలు చేస్తున్నారని మందడం మహిళలు మండిపడుతున్నారు. పోలీసులు తమపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏదో ఒక సాకుతో తమపై వేధింపులకు పాల్పడుతున్నారని.. మహిళలు అని కూడా చూడకుండా కొడుతున్నారని.. గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు.

Next Story

RELATED STORIES