విశాఖలో ప్రజాచైతన్య యాత్రకు భారీ స్పందన

విశాఖలో ప్రజాచైతన్య యాత్రకు భారీ స్పందన

వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలకు భారీ స్పందన లభిస్తోంది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చీమలపల్లిలో.. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు. చీమలపల్లిలో నిర్మిస్తున్న గృహాలను ముట్టడించిన లబ్దిదారులకు ఆయన సంఘీభావం తెలిపారు. టీడీపీ హయాంలో ఏపీ కిట్కో ద్వారా గృహాలు మంజూరు చేశామన్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసి లబ్దిదారులకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Next Story