నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం

నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం

2012 ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో మరణశిక్ష పడ్డ వారిలో ఒకరైన వినయ్ శర్మ తీహార్ జైలులో ఆత్మహత్యాయత్నం చేశాడు. జైలు గదిలోని గోడకు తలను బలంగా కొట్టుకొని తనను తాను గాయపరుచుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కోర్టు సోమవారం కొత్త డెత్ వారెంట్ జారీ చేయడంతో నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో నలుగురు దోషులను ఒకేసారి మార్చి 3న ఉరి తీయనున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి అతను తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అందువల్ల మరణశిక్ష అమలు చెయ్యొద్దని వినయ్ న్యాయవాది గతంలో కోర్టుకు అభ్యర్ధించారు. అయితే అతని వాదనను తోసిపుచ్చిన కోర్టు.. చట్టం ప్రకారం వినయ్‌పై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశించింది.

Tags

Next Story