నూతన సీవీసీగా సంజయ్ కొఠారి
రాష్ట్రపతి కార్యదర్శి సంజయ్ కొఠారిని కేంద్ర నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. ఆయన ఎంపిక దాదాపు పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని హై పవర్ కమిటీ సంజయ్ కొఠారిని ఎంపిక చేసినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపారు. ఈఅలాగే ప్రస్తుతం సమాచార కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న బిమల్ జుల్కాను కేంద్ర సమాచార కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) గా ఎంపికచేశారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తర్వాత ఈ నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యక్తిరేకిస్తోంది. నూతన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ నియామకానికి అనుసరించిన ప్రక్రియను చట్టవిరుద్ధం మరియు రాజ్యాంగ విరుద్ధం అని కాంగ్రెస్ పేర్కొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com