ఆన్సర్ షీట్ లో రూ.100 లు పెడితే పాస్ అంటూ.. అడ్డంగా ఇర్రుకున్న ప్రిన్సిపాల్

ఉత్తరప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (యుపిఎస్ఇపి) పరీక్షలు మంగళవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి.10, 12 తరగతుల విద్యార్థులు 56 లక్షల మందికి పైగా పరీక్షకు కూర్చున్నారు. అయితే ఈ సందర్బంగా లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది. విద్యార్థులు ప్రశ్నలకు ఆన్సర్లు రాయకుండా మార్కులు ఎలా వేయించుకోవాలి సూచనలు ఇచ్చాడు. అతని దురదృష్టవశాత్తు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
'మౌ' జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ మాల్ పరీక్షల్లో ఎలా మోసం చేయాలో మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కఠినమైన షరతులను ఎలా ఉల్లంఘించాలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆన్సర్ షీట్ లో ఎటువంటి సమాధానాలు ఇవ్వకుండా.. రూ. 100 ఉంచాలని.. ఉపాధ్యాయులు గుడ్డిగా మార్కులు ఇస్తారని.. ఒకవేళ ఒక ప్రశ్నకు తప్పుగా సమాధానం ఇచ్చినా.. అది నాలుగు మార్కుల ప్రశ్న అయినా మూడు మార్కులు వేస్తారని నమ్మబలికాడు. అయితే అతను ప్రసంగిస్తున్న సమయంలో ఓ విద్యార్థి అతని మాటలను వీడియో తీశాడు, అనంతరం ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com