ఆంధ్రప్రదేశ్

ఇలా చేస్తే ప్రజాచైతన్య యాత్ర ఇంచు కూడా కదలకుండా చేస్తాం: రోజా

ఇలా చేస్తే ప్రజాచైతన్య యాత్ర ఇంచు కూడా కదలకుండా చేస్తాం: రోజా
X

రైతుల ముసుగులో టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తాను పెదపరిమి వస్తానని తెలిసే దాడి చేసేందుకు ప్లాన్ చేసుకున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రజలు నిలదీయాల్సింది వైసీపీ నేతలను కాదని.. చంద్రబాబుతో పాటు ఆయన కేబినెట్‌ను నిలదీయాలని అన్నారు. మాయమాటలు చెప్పి రైతుల నుంచి భూములు తీసుకొని.. ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేదన్నారు. చంద్రబాబు మాటలు విని మోసపోవద్దని రాజధాని ప్రజలకు సూచించారామె.

ఎమ్మెల్యేలపై ఇలాగే దాడులు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చంద్రబాబుని హెచ్చరించారు రోజా. ఇలాగే వ్యవహరిస్తే ప్రజాచైతన్యయాత్ర ఇంచు కూడా కదలకుండా చేస్తామన్నారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టకుంటే తగిన శాస్తి జరుగుతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

Next Story

RELATED STORIES