ఆంధ్రప్రదేశ్

ఉగాది కల్లా పేదలకు ఇళ్లు ఇస్తాం : మంత్రి బొత్స

ఉగాది కల్లా పేదలకు ఇళ్లు ఇస్తాం : మంత్రి బొత్స
X

ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ఉగాది కల్లా పేదలకు ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇందుకోసం పట్టణ ప్రాంతాల్లో భూసేకరణ జరుగుతోందని అన్నారు. కొన్ని చోట్ల భూములు కొనుగోలు చేసి అర్హులైన లబ్దిదారులు అందిస్తామని తెలిపారు. ఎక్కడా బలవంతంగా భూ సమీకరణ చేయడం లేదని చెప్పారు. ఇళ్ల ప్లానింగ్‌ కోసం ఇప్పటికే ఓ కమిటీని కూడా నియమించామన్నారు బొత్స. విశాఖలో జరిగిన సమీక్షా సమావేశంలో బొత్స పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన సమస్యలపై చర్చించారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడంపై ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి చెప్పారు.

Next Story

RELATED STORIES