తిరుపతిలో సైకోల వీరంగం

తిరుపతిలో సైకోల వీరంగం

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో నలుగురు సైకోలు వీరంగం సృష్టించారు. బ్లేడ్లతో కోసుకుని భయభ్రాంతులకు గురిచేశారు. ఆసుపత్రికి వచ్చిన నలుగురు సైకోలు రోగులతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. దీంతో వారితో మాట్లాడటానికి ప్రయత్నించిన సిబ్బందితో గొడవకు దిగారు. రుయా అవుట్ పోస్ట్ లోని పోలీసులు గమనించి సైకోలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే సైకోలు గట్టిగా అరుస్తూ బ్లేడ్లతోకోసుకున్నారు. సైకోల ప్రవర్తనతో రోగులు, నర్సులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పోలీసులు చాకచక్యంగా వ్యహరించి సైకోలను పట్టుకున్నారు. అయితే వారు ఎందుకలా ప్రవర్తించారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

Tags

Next Story