కోటప్పకొండలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు

కోటప్పకొండలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు

శివరాత్రి ఉత్సవాలు కోటప్పకొండలో వైభవంగా జరుగుతున్నాయి. త్రికోటేశ్వరుడి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అటు, కోటప్పకొండకు సమీప గ్రామాల నుంచి తరలివస్తున్న ప్రభల్లో అమరావతి ప్రభ అందరినీ ఆకట్టుకుంటోంది. మన అమరావతి.. మన రాజధాని నినాదంతో దీన్ని ఏర్పాటు చేశారు. అటు, రాజధాని అమరావతి నుంచి పెద్ద ఎత్తున మహిళలు కోటప్పకొండకు వెళ్తున్నారు. అమరావతే రాజధానిగా ఉండాలంటూ ముక్కంటికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Tags

Next Story