గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాం : మంత్రి కేటీఆర్

గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాం : మంత్రి కేటీఆర్

ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. అందుకే కీలకమైన సంస్కరణలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త పంచాయతీ రాజ్‌, మున్సిపల్ చట్టాలు కఠినంగా ఉంటాయని.. పని చేయకపోతే పదువులు పోతాయని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు..యువత, కుల సంఘాలను కూడా పల్లెప్రగతిలో భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని..వచ్చె నెల నుంచి సీఎం కేసీఆర్ కూడా వస్తారని చెప్పారు. అంతకుముందు సిరిసిల్ల పట్టణంలోని వసతి గృహాన్ని పరిశీలించారు కేటీఆర్. అక్కడి వసతులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు.

Tags

Next Story