ఏపీ ఈఎస్ఐ స్కాంపై స్పందించిన అచ్చెన్నాయుడు

ఏపీ ఈఎస్ఐ స్కాంపై స్పందించిన అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ఈఎస్ఐలోను కుంభకోణం జరిగినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అవకతవకల్లో తన పేరు రావడంపై కార్మిక శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. టెలీ హెల్త్ సర్వీసెస్ తన హయాంలోనే మొదలైందని అన్నారు. అంతకంటే ముందు తెలంగాణలో ప్రారంభించారని.. అక్కడి మాదిరే ఏపీలో అమలు చేయాలని నోట్ పంపానని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో కేటాయించాలని ఆదేశించలేదని అన్నారాయన. దురుద్దేశాలతో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో గట్టిగా పోరాటం చేస్తున్నందుకే అచ్చెన్నాయుడిని ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీ నాయకుడిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 7.96 కోట్ల రూపాయలు విలువైన టెలీ మెడిసిన్ ప్రాజెక్టులో వందల కోట్ల అవినీతి ఎలా సాధ్యమని కొల్లు ప్రశ్నించారు. విజిలెన్స్ నివేదికలో అచ్చెన్నాయుడి పేరే లేదని అన్నారు.

Tags

Next Story