శివరాత్రి ఉపవాస దీక్షలు చేస్తూనే రాజధాని కోసం ఆందోళనలు
రాజధాని కోసం రెండు నెలలకు పైగా ఉద్యమిస్తున్నా.. వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని రైతులు మండిపడుతున్నారు. పైగా పోలీసుల దౌర్జన్యంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా.. శనివారం అమరావతి బంద్ కు పిలుపునిచ్చారు రాజధాని రైతులు. 29 గ్రామాల్లో శనివారం బంద్ నిర్వహించనున్నారు. విద్య, వ్యాపార సంస్థలు బంద్ పాటించాలని జేఏసీ కోరింది.
అటు, అమరావతి పోరు రోజురోజుకూ ఉధృతంగా మారుతోంది. 66వ రోజున కూడా 29 రాజధాని గ్రామాలు ధర్నాలు, నిరసనలు, ఆందోళనలతో హోరెత్తుతోంది. మహిళలు, రైతులు, యువకులు పెద్దయెత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఓ వైపు శివపంచాక్షరీ మంత్రం జపిస్తూనే.. సేవ్ అమరావతి అంటూ నినదిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com