పాక్‌తో స్నేహమేంటి.. మాజీ ఎంపీ శతృఘ్నసిన్హాకు ప్రశ్నల వర్షం

పాక్‌తో స్నేహమేంటి.. మాజీ ఎంపీ శతృఘ్నసిన్హాకు ప్రశ్నల వర్షం

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, బీజేపీ మాజీ ఎంపీ శతృఘ్నసిన్హా పాకిస్థాన్‌లో పర్యటించడం వివాదస్పదమవుతుంది. పాక్‌కు చెందిన వ్యాపారవేత్త మియాన్‌ అసద్‌ అహసన్‌ ఆహ్వానంపై సిన్హా లాహోర్‌కి వెళ్లి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నటి రీమాఖాన్ తో కలిసి వివాహ విందులో పాల్గొని నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇప్పుడు ఈ వీడియాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాది ఆత్మాహుతి దాడి ఘటనలో మన దేశ CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో శతృఘ్నసిన్హా పాకిస్థానీలతో స్నేహాన్ని కొనసాగించడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story