యువతను టార్గెట్ చేసిన పీకే

యువతను టార్గెట్ చేసిన పీకే

పీకే స్టెప్స్ స్టార్టయ్యాయి. బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ మొదటి అడుగు వేశారు. బిహార్‌ లోని వివిధ రాజకీయ పక్షాలతో మంతనాలు మొదలుపెట్టారు. హిందుస్థాన్ అవామ్ మోర్చా అధ్యక్షుడు జితిన్‌ రాం మాంఝీ, RSLP అధినేత ఉపేంద్ర కుశ్వాహాలను పీకే కలిశారు. బిహార్‌లో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. ఉమ్మడి రాజకీయ వేదిక ఏర్పాటుపై సమా లోచనలు జరిపారు. మహాఘట్‌బంధన్‌లో కాంగ్రెస్, ఆర్జేడీలు కూడా భాగస్వామ్యపార్టీలే. ఐతే, ఆర్జేడీతో జట్టు కట్టడానికి పీకే ఇష్టపడడం లేదని సమాచారం.

బిహార్‌ ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన ప్రశాంత్ కిషోర్, యువతను టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా బాత్ బిహార్‌ కీ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఇందులో యువతీయువకులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సభ్యత్వ నమోదు కూడా మొదలుపెట్టారు. దేశంలోనే ఉత్తమరాష్ట్రంగా బిహార్‌ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పీకే పేర్కొన్నారు. నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా యూత్ ఆర్మీని సృష్టించే పనిలో పీకే ఉన్నారని ఆయన వర్గీయులు తెలిపారు. బిహార్‌లో నితీష్‌కు ప్రత్యామ్నాయం సృష్టించడానికి కొంత సమయం పడుతుందనే విషయం పీకేకు తెలుసని, అందుకే యువతను ముందుకు తీసుకువస్తు న్నారని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story