కాగజ్‌నగర్‌ సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో ప్రమాదం

కాగజ్‌నగర్‌ సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో ప్రమాదం

కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలకు సిర్పూర్ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు.

కొత్త విద్యుత్ ప్లాంట్‌ కోసం బాయిలర్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్క మట్టిపెళ్లలు కూలాయి. దీంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. దాదాపు 50 మీటర్ల లోతులో కార్మికులు చిక్కుకున్నారు.. మృతి చెందిన వారంతా జార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story