మస్త్‌గా చిందేసిన పోలీసులు

మస్త్‌గా చిందేసిన పోలీసులు

బెంగళూరు పోలీసులు సంతోషంతో ఊగిపోయారు. ఆనందంతో ఊర్రూతలూగారు. మస్త్ మస్త్‌గా చిందేశారు. విజిల్స్, అరుపులతో కేక పుట్టించారు. ఈ ఉల్లాసం, ఉత్సాహాలకు కారణం జుంబా డాన్స్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 750 మంది పోలీసులు.. వాళ్లంత తమ పొజిషన్లు, డ్యూటీలు మరిచిపోయారు. హోదాలు అధికారాలు పక్కన పెట్టేశారు. పాట విన్నామా స్టెప్పులేశామా అన్నట్లుగా ఎంజాయ్ చేశారు. వందల మంది పోలీసులు ఒకేసారి డ్యాన్స్ చేస్తే ఎట్టుంటాదో తెలుసా అన్నట్లుగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

పోలీసులు నిత్యం ఫుల్ స్ట్రెస్‌లో ఉంటారు. కేసులు, వివాదాలు, కోర్టు వ్యవహారాల్లో మునిగి తేలుతుంటారు. దాంతో పోలీసులకు ఒత్తిడి నుంచి రిలీఫ్ కల్పించడానికి నార్త్ ఈస్ట్ డివిజన్‌ డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. రిథమిక్ స్ట్రెస్ బస్టర్-జుంబా ప్రోగ్రాం క్యాప్షన్‌తో జుంబా క్లాస్ నిర్వహించింది. ఇలా పిలుపు వచ్చిందో లేదో పోలీసులంతా అలా వాలిపోయారు. అన్ని రకాల పనులను కాసేపు పక్కన పెట్టి హాయిగా ఆడిపాడారు. బెంగళూరు పోలీసుల జుంబా డాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story