గూగుల్ ప్లేస్టోర్ నుంచి 600 యాప్‌లు తొలగింపు

గూగుల్ ప్లేస్టోర్ నుంచి 600 యాప్‌లు తొలగింపు

నిబంధనల ఉల్లంఘన, మోసాలకు పాల్పడుతున్న యాప్‌లపై గూగుల్ మరోసారి వేటు వేసింది. వందల సంఖ్యలో యాప్‌లకు చెక్ పెట్టింది. దాదాపు 6 వందల యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొ గించింది. ప్రకటనల మానిటైజే షన్ ప్లాట్‌ఫామ్‌లైన గూగుల్ యాడ్‌మాబ్, గూగుల్ యాడ్ మేనేజర్‌ల నుంచి ఆ యాప్‌లను నిషేధించారు. ప్రకటన మోసాలను అరికట్టడంలో భాగంగా ఈ చర్య తీసుకు న్నామని గూగుల్ ప్రకటించింది. కొత్తగా అభివృద్ధి చేసిన టెక్నాల జీ సాయంతో వందల అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్ నుండి తీసివేసామని వెల్లడించింది.

అప్లికేషన్ల తీరుపై గూగుల్ యాజమాన్యం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. యూజర్ల ఇష్టాలకు విరుద్దంగా ప్రకటనలు వస్తున్నా యని ఆరోపించింది. బ్రౌజింగ్‌లో అనవసరమైన ప్రకటనలతో నెటిజన్లకు చిరాకు పుట్టిస్తున్నారని విమర్శించింది. బ్రౌజర్‌లో ఊహించని విధంగా యాడ్స్ పాప్ అప్ అవుతూ అంతరాయం కలిగిస్తున్నాయని మండిపడింది. యాప్‌లో యూజర్‌ చురుగ్గా లేనప్పడు కూడా హానీకరమైన ప్రకటనలు వస్తున్నాయని పేర్కొంది. ఇలాంటి వ్యవహారాలను తాము అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తొలగించిన యాప్‌లు ఇప్పటికే నాలుగున్నర బిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌ అయ్యాయని తెలిపింది.

Tags

Next Story